
Uttar Pradesh: మన దేశంలో గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో గంటకు 19 మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న ఈ ప్రమాదాలను తగ్గించేందుకు, భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వివారాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో ప్రతి సంవత్సరం నవంబర్‌లో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాదిలో కూడా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి పైన భారీ మొత్తంలో చలానా విధించబడుతుంది ప్రచారం చేశారు. ఈ క్రమంలో గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు గురువారం నోయిడా, గ్రేటర్ నోయిడాలో నిబంధనలను ఉల్లంఘించిన ప్రయాణికులపై 4,000 కంటే ఎక్కువ చలాన్లు అంటే నిమిషానికి సగటున 2.7 చలాన్లు జారీ చేయబడ్డాయి. అలానే డజనుకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Raed also:Rohit Sharma: మా మొదటి లక్ష్యం నెరవేరింది.. ఇక ముందుంది అసలు పండగ: రోహిత్
అయితే పోలీసుల నివేదిక ప్రకారం ప్రతి నిమిషానికి 3 చలాన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీసుల నివేదిక ప్రకారం.. గురువారం 4,012 చలానాలు జారీ చేశారు. కాగా ఇందులో 2,910 (72.53 శాతం) చలనాలు ద్విచక్ర వాహనదారులకు జారీ చేసారు. నో పార్కింగ్ లో పార్క్ చేయబడిన వాహనాలకు 413 చలానాలు జారీచెయ్యగ, ఫోర్ వీలర్లలో సీటు బెల్ట్ ధరించనందుకు 109 , రాంగ్ లేన్‌లో డ్రైవింగ్ చేసినందుకు 210 , నంబర్ ప్లేట్ లేని వాహనాలకు 71, రెడ్‌లైట్లు పడిన ఆగకుండా వెళ్లిన వాహనాలకు 67, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడ్ చేసినందుకు 37, మొబైల్ ఫోన్లు వాడుతూ డ్రైవ్ చేసినందుకు 19, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినందుకు 27 చలాన్లు జారీ చేశారు.