Leading News Portal in Telugu

Selling Snake : 10 గ్రా పాము విషం ఖరీదు లక్షల్లో.. లాకప్ లో ముగ్గురు


Selling Snake : 10  గ్రా పాము విషం ఖరీదు లక్షల్లో.. లాకప్ లో  ముగ్గురు

Uttar Pradesh: ముల్లును ముళ్ళుతోనే తియ్యాలి అన్నట్లు విషానికి విరుగుడు విషమే. అందుకే పాము, తేలు వంటి విషపురుగుల విషానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలానే పాము చర్మాన్ని బ్యాగులు, బెల్ట్లు మొదలనవి తారలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇక పాము విషం ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 10 గ్రాముల పాము విషం అక్షరాలా రూ/లక్షన్నర పలుకుతుంది. దీనితో కొందరు వన్య ప్రాణుల కిందకి వచ్చే పాములను పట్టుకుని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. అయితే పాములను పట్టుకోవడం, చంపడం, చిత్ర హింసలకు గురిచేయడం చట్ట విరుద్ధం. ఇలా చట్టవిరుధంగా పాములను పట్టుకుని సొమ్ము చేసుకున్న వారిని గతంలో చటం శిక్షించిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది..

Read also:Tamilnadu: తమిళనాడులో దారుణం.. బట్టలిప్పి యువకులపై మూత్ర విసర్జన

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మధుర నగరానికి చెందిన సత్పాల్, శ్యామ్ నాథ్, పప్పు నాథ్‌ గత కొంత కాలంగా పాములను పట్టుకుని, వాటి నుండి విషాన్ని సేకరించి బ్లాక్ మార్కెట్ లో పది గ్రాముల పాము విషాన్ని రూ/లక్షన్నర ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలానే పాములను కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్మగ్లర్లను మధుర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ.. నిందితులు పాములను అడవులు, జాతీయ ఉద్యానవనాల నుంచి పట్టుకుంటున్నారని.. అలానే బ్లాక్ మార్కెట్ లో రూ/ లక్షన్నరకు వాటి విషాన్ని విక్రయించడంతో పాటుగా పాములను కూడా అమ్ముతున్నారని తెలిపారు. అలానే నాలుగు కొండచిలువలు, మూడు నాగుపాములను నిందితుల నుండి మధుర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పాముల స్మగ్లర్లను పట్టుకునేందుకు పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యులు సహాయం చేశారని పోలీసులు తెలిపారు.