
Uttar Pradesh: గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా పైన ద్రుష్టి సారించారు నోయిడా పోలీసులు. ఈ నేపథ్యంలో నోయిడాలో పోలీసులు ఈ రోజు ఉదయం చేసిన దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 మంది పట్టుబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ అనే స్నేక్‌చామర్ దగ్గర 20 ఎంఎల్ విషాన్ని పోలీసులు కనుగొన్నారు. కాగా కనుగొన్న ఆ విషాన్ని విచారణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. అయితే ఈ కేసులో నిందితలను విచారించగా పలువురు వ్యక్తులు నిందితుల దగ్గర నుండి పాము విషాన్ని కొన్నట్లు తేలింది. నిందితుల దగ్గర నుండి పాము విషం కొనుగోలు చేసిన వ్యక్తుల లిస్ట్ లో బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ పేరు కూడా ఉందని.. అతను పరారీలో ఉన్నారని.. అని సోషల్ మీడియా, సాంఘీక మాధ్యమాలల్లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
Read also:CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ఈ నేపధ్యంలో అతని పైన వస్తున్న ఆరోపల పై సపందించారు ఎల్విష్. ఎల్విష్ యాదవ్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని మీడియాలో తన పైన వస్తున్న వార్తలను తాను చూసానని.. కానీ ఆ అవన్నీ కేవలం ఆరోపణలని.. తన పేరును చెడగొట్టేందుకు ఎవరో ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు. అలానే యూపీ పోలీసులకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని. ఈ విషయంలో తన పైన వస్తున్న ఆరోపణలు 1% రుజువైన తాను బాధ్యత వహించడానికి, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆ డ్రగ్స్ కేసుతో తనకు అస్సలు సంబంధం లేదని.. దయచేసి ఎలాంటి రుజువు లేకుండా నా పేరును కించపరిచే ప్రయత్నం చేయవద్దని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని తెలిపిన ఆయన. ఈ విషయంలో అధరాలు లేకుండా నా పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను, గౌరవనీయులైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కోరుతున్నాను అని పేర్కొన్నారు.