Leading News Portal in Telugu

Bihar: గొప్పోళ్ళురా బాబు.. రోడ్డునే మాయం చేశారు..



Untitled 1

Bihar: సాధారణంగా రోడ్లు బాగాలేవని.. గతుకులు, గుంతలతో రోడ్డు అద్వానంగా తయారైన అధికారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేయడం మనం చూస్తుంటాము. కానీ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో.. కనీసం సరైన రోడ్డు సౌకర్యం అయినా కల్పించాలి అనుకుంటే ప్రభుత్వానికి సహకరించని ప్రజలు ఎక్కడైనా ఉంటారా..? అంటే ఉన్నారు అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూ ఉంటె.. మరో వైపు నుండి తడి కాంక్రీట్ నే దోచుకు పోతున్నారు మేధావులు.. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బిహార్‌ ముఖ్యమంత్రి సడక్‌ గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామ్‌ యోజన కింద జహానాబాద్‌ జిల్లా లోని ఔదాన్‌ గ్రామంలో తాజాగా రోడ్ల నిర్మాణం చేపట్టారు.

Read also:Bandi Sanjay: ఈనెల 6న బండి సంజయ్ నామినేషన్.. 8 నుంచి సుడిగాలి పర్యటన

ఈ క్రమంలో కార్మికులు ఓ వైపు నుండి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ రోడ్డుకి వేసిన కాంక్రీట్ కనీసం ఆరకముందే తడి కాంక్రీట్ నే మాయం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వుకుంటూ తడి కాంక్రీట్ ను దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని పైన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా మూడు నెలల క్రితం రోడ్డు పనులను స్థానిక MLA ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. పనులు ప్రారంభించిన ప్రతిసారి స్థానిక ప్రజలు రోడ్డు నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని దోచుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రోడ్డునే లూటీ చేసేసారు.