
Odisha: కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు జిల్లా తిరుమలలో చిరుతలు బీభత్సం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే.. అప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు ప్రజలు చాల భయపడ్డారు. అయితే ప్రభుత్వం చర్యలను తీసుకుని చిరుతల బెడదను తొలిగించింది. కాగా ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో పులులు కలకలం సుష్టిస్తున్నాయి. దీనితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఒడిస్సా రాష్ట్రం లోని నువాపాడ జిల్లా సదర్ రేంజ్, ధరంబంధ పోలీస్ స్టేషన్, సిలారిబహరా గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. శనివారం నువాపాడ జిల్లా లోని సిలారిబహరా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామేశ్వరి మాఝీ(50) పైన పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మరణించగా అనంతరం ఆమె మృతదేహాన్ని పులి తినేసింది.
Read also:Anam Venkata Ramana Reddy: పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి..
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆదివారం మరో పులి మళ్లీ భీభత్సం సృష్టించింది. ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసింది. కాగా ఆ పులి భారీ నుండి గ్రామస్థులు చిన్నారిని రక్షించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నువాపా జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కోడోపలికి చేరుకుని పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.