Leading News Portal in Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బాంబు పేలుడు.. కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలు


Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బాంబు పేలుడు.. కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలు

Chhattisgarh: అసెంబ్లీ పోలింగ్ కు ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో బాంబు పేలుడు ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలయ్యాయి. గాయపడిన BSF కానిస్టేబుల్‌ను ప్రకాష్ చంద్‌గా గుర్తించారు. అతనిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు పోలింగ్‌ అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కాంకేర్‌ జిల్లాలోని మార్బెడ నుండి రెంగాఘటి రెంగగొండి పోలింగ్ స్టేషన్‌కు వెళుతుండగా పేలుడు సంభవించింది.

మరోవైపు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. రేపు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది.