Leading News Portal in Telugu

Parliament’s Winter session: డిసెంబర్ రెండో వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..?


Parliament’s Winter session: డిసెంబర్ రెండో వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..?

Parliament’s Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, క్రిస్మస్‌కి ఒక రోజు ముందు ఈ సమావేశాలు ముగియవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తర్వాత కొన్ని రోజులకు పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

IPC, CrPC మరియు ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కీలక బిల్లులను శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లులపై హోమ్ శాఖ స్టాండింగ్ కమిటీ ఆమెదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్ లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసన మధ్య ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాలేదు. సీఈసీ, ఈసీ హోదాలను క్యాబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. ప్రస్తుతం వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాను అనుభవిస్తున్నారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమై డిసెంబర్ 25 లోపు ముగుస్తాయి.