
Bengaluru: ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఆయుధం తోనే పోతారు అంటారు మన పెద్దలు. కొన్ని సార్లు ఆ మాట నిజమే అనిపిస్తుంది. టీ తాగేందుకు వెళ్ళాడు ఓ రౌడీషీటర్. క్షణాల్లో ఆ రౌడీషీటర్ ను చుట్టుముట్టి చంపేశారు కొందరు దుండగులు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సహదేవ్ అనే రౌడీషీటర్ కర్ణాటక రాష్ట్రంలో ధారుణ హత్యకు గురైయ్యాడు. బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని చుంచనఘట్ట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సహదేవ్ నిన్న రాత్రి టీ తాగేందుకు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో బేకరీ సమీపం లోకి రాగానే మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దుండగులు సహదేవ్‌పై ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Read also:Fraud Case of Rs 20 lakhs : కంపెనీ ఫ్రాంచైజీ ఇస్తానంటూ రూ.20 లక్షల మోసం.. ఐదుగురిపై కేసు నమోదు
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సహదేవ్ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితులు ఘటన స్థలం నుండి పరారైయ్యారు. కాగా హత్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పుట్టెనహళ్లి స్టేషన్ పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి కోననకుంటె పోలీస్‌స్టేషన్ పరిధి లోని రౌడీషీటర్ కావడంతో పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలానే హత్య చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.