
Uttar Pradesh: 2021 లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన కాగజ్ ఈ సినిమా చూసిన వాళ్ళకి మృతక్ లాల్ బిహారీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన బ్రతికి ఉండగానే రికార్డ్స్ లో చనిపోయినట్లు చిత్రీకరించారు. కేవలం అయన ఆస్థి కోసం సొంత మామనే అధికారులకు లంచం ఇచ్చి ఇలా చిత్రీకరించారు. అయితే తాను చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నాను అని నిరూపించుకునేందుకు లాల్ బిహారీకి 19 సంవత్సరాలు పట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పేరులో మృతక్ అనే పేరును చేర్చుకున్నారు. ఆతరువాత ఆయన ఆస్థి కోసం తనలాగా బ్రతికి ఉండాగానే రికార్డ్స్ లో చనిపోయిన వ్యక్తులుగా చిత్రీకరించబడిన వ్యక్తులు తరుపున పోరాటం చేయడం ప్రారంభించారు. అలానే లాల్ బిహారీ ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఆస్థిని లాక్కోవడానికి ప్రభుత్వ రికార్డులలో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తుల దుస్థితిని హైలైట్ చేయడానికి ‘మృతక్ సంఘ్’ని స్థాపించారు.
Read also:WC 2023 NZ VS SL: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
కాగా తాజాగా ఆయన యూపీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తనలాగా బ్రతి ఉండగానే రికార్డ్స్ లో మరణించిన వారి పక్షాన పోరాడుతున్న అతనికి ప్రాణ నష్టం ఉందని.. కావున అతనికి AK-47 రైఫిల్ లైసెన్స్ పొందడానికి తనకు అనుమతి ఇవ్వాలని.. తాను ప్రధాన కార్యదర్శిని అభ్యర్థిస్తున్నట్లు లాల్ బిహారీ పేర్కొన్నారు. సాధారణ పౌరులు AK-47ని కలిగి ఉండేదుకు వీలు లేదని ఈ విషయం తనకు కూడా తెలుసని.. ఎందుకంటే ఈ ఆయుధం ప్రత్యేక దళాలకు మాత్రమే నిర్ధేశించబడిందని. కానీ దానిని ‘మృతక్’ (చనిపోయిన వ్యక్తి)కి ఇవ్వవచ్చు అని తెలిపారు. ఇలా అతనికి AK-47 గన్ లైసెన్స్‌ను ఇవ్వాల్సిందిగా యూపీ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు అయన తెలిపారు.