
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. ఈ సందర్భంగా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వాయు కాలుష్యం యొక్క తీవ్ర సవాలును పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ జారీ చేశారు. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇక్కడి ప్రజలు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తరచుగా పేలవమైన స్థాయి నుండి తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. ఇక, శీతాకాలంలో ఈ సమస్య మరింత పేరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వాయు కాలుష్యం ద్వంద్వ ముప్పును కలిగిస్తుందని చెప్పారు. వాయు కాలుష్యం యొక్క ఆరోగ్య ప్రభావాలను హైలైట్ చేస్తూ.. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దోహదం చేస్తుందని, శ్వాసకోశ, హృదయ, సెరెబ్రోవాస్కులర్ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.
తరచుగా అకాల మరణాలకు దారితీస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దీర్ఘకాల ఆనారోగ్య సమస్యలతో రోగాలు ఉన్నవారు తగిన జాగ్రత్తుల తీసుకోవాలని పంత్ సూచించారు. వాయు కాలుష్యం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అడ్వైజరీలో పాఠశాల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త విభాగం ఉంది.. వాయు కాలుష్యానికి వారు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్య వ్యవస్థలను పెంపొందించడంతో పాటు వాయు కాలుష్యం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య పరిణామాల గురించి అవగాహన పెంచాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ సూచించారు. లేఖలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య అధికారులను ఆయన తెలిపారు. వాతావరణ మార్పు, ఆరోగ్యం కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తగిన ప్రణాళికలను రూపొంచించాలన్నారు. వాయు కాలుష్యంతో సహా వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యం కోసం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర-స్థాయి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ చెప్పుకొచ్చారు.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (NPCCHH) ఇప్పటికే రాష్ట్ర-స్థాయి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుంది. తదుపరి దశలో జిల్లా, నగర-స్థాయి ప్రణాళికలను రూపొందించడంతో పాటు వాయు కాలుష్య-సంబంధిత వ్యాధులపై నిఘా కోసం సెంటినెల్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను విస్తరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ ప్రతిపాదించారు.