Leading News Portal in Telugu

Uttar Pradesh: వారి బాధ్యత రైల్వేదే.. ఒప్పందంపై సంతకాలు చేసిన RDWA



Untitled 2

Prayagraj (UP): ఏళ్ల తరబడి రైలు పట్టాల చుట్టూ నివసిస్తున్న పేద పిల్లలకు ఓ శుభవార్త.. ఇక పైన ఆ పేదపిల్ల బాధ్యతను రైల్వే తీసుకోనుంది. సంచార జీవనం గడుపుతూ రైలు పట్టాల దగ్గర గుడిసెల్లో నివసించే పిల్లలకు ఉన్నతమైన జీవితాన్ని అందించేందుకు ఆ పిల్లలకు చదువు చెప్పించేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సిఆర్) సన్నాహాలు చేస్తుంది. ఏళ్ల తరబడి రైలు పట్టాల చుట్టూ జీవిస్తున్న పేదల జీవన విధానంలో మార్పు తీసుకు రావడానికి నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సిఆర్) అధికారులు చొరవ చూపిస్తున్నారు. దేశంలో ఎంతో మంది రైలు పట్టాల పక్కన తాత్కాలిక గుడిసెలలో నివసిస్తున్నారు. పేదరికం కారణంగా ఆ చిన్నారులు కనీస విద్యకు నోచుకోలేకున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారులకు నిత్యావసరాలతో పాటుగా విద్యను అందించడానికి NCR భారత్ రైల్ విద్యా ఫెలోషిప్ కింద ఒక పథకాన్ని సిద్ధం చేసింది.

Read also:Telangana Assembly Elections 2023: నేడే తెలంగాణలో నామినేషన్లకు చివరి రోజు.. లైవ్ అప్‌డేట్స్

ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌ లోని ఎన్‌సీఆర్‌ లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ డ్రీమ్స్ వీవర్స్ అసోసియేషన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎన్‌సిఆర్‌ లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ మొదటి దశలో ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్, కాన్పూర్, తుండ్లా (ఆగ్రా) , అలీఘర్ నగరాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ముందుగా రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే వ్యక్తుల జాబితాను ప్రయాగ్‌రాజ్ డివిజన్‌ లోని రైల్వే సిబ్బంది నేతృత్వంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ డ్రీమ్స్ వీవర్స్ అసోసియేషన్ సంయుక్త బృందం సిద్ధం చేస్తుంది.