
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. ఇలాంటి నోటీసులే కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి కూడా ఈసీ పంపింది. మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తప్పుడు, నిర్థారించని వ్యాఖ్యలు చేశారని ప్రియాంకాగాంధీపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి 8 గంటలలోపు ఆమె ప్రకటనలపై వివరణ ఇవ్వానలి ఈసీ కోరింది.
Read Also: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
నోటీసు ప్రకారం.. బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదులో ఆప్ ఎక్స్(ట్విట్టర్)లో రెండు పోస్టుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ ప్రధాని మోడీని కించపరిచేలా, అవమాకరమైనవిధంగా పరువు నష్టం కలిగించే విధంగా చిత్రీకరించాయని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ నేతల అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా ప్రభావితం చేసేలా దురుద్దేశంతో పోస్టులను షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రత్యారోపణలు, దూషణల ద్వారా ఎన్నిలక నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని, నిర్ణీత సమయంలో మీనుంచి స్పందన రాని పక్షంలో, ఎన్నికల సంఘం మీకు తదుపరి సూచన చేయకుండా తగిన చర్యలు తీసుకుంటుందని ఆప్‌కి పోల్ ప్యానెల్ తెలిపింది.
నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)ని ఆశ్రయించింది. ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అనైతిక వీడియోల క్లిప్స్, వ్యాఖ్యలు పోస్ట్ చేసింనదుకు ఆప్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్ మరియు రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్‌లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై పోల్ ప్యానెల్‌ను సంప్రదించింది.