
ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం ప్రమాదకర స్థితికీ వాయు కాలుష్యం చేరింది. గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆరోగ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రదేశాలు 400 కంటే ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( AQI) నమోదు అయింది. ఆనంద్ విహార్ లో అత్యధికంగా AQI 447 వద్ద నమోదు అయింది. ఆ తర్వాత ఆర్కేపురం 467, ఐజీఐ విమానాశ్రయం 467, ద్వారక 490 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచికలు నమోదు అయ్యాయి. ఇక, నిరంతరంగా అధిక స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది.
CPCB వెబ్‌సైట్ నోయిడా యొక్క AQIని 352గా సూచించింది. అయితే గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్-III AQI 314గా ఉంది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో, సెక్టార్ 51లో ఉదయం 5 గంటలకు AQI 444గా నమోదు అయింది. ప్రశాంతమైన గాలులు, శీతల ఉష్ణోగ్రతల వల్ల కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి కారణమం అవుతున్నాయి, మరి కొన్ని రోజుల పాటు ఎలాంటి ఉపశమనాన్ని పొందలేదమని వాతావరణ వాఖ అధికారులు తెలిపారు. అయితే, నవంబర్ 21 నుండి గాలి వేగం మెరుగుపడటం వల్ల వాయు కాలుష్య స్థాయిలు తగ్గుతాయని అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
ఇక, నిర్మాణాలు, డీజిల్ తో నడిచే వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు, వివిధ కాలుష్య మూలాలతో సహా బహుళ కారకాలు నిరంతర గాలి నాణ్యత సమస్యలకు దోహదం చేస్తున్నాయి. ఇక, నిన్న స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించింది. బాగ్దాద్, లాహోర్ వరుసగా రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి.