Leading News Portal in Telugu

Commando Suicide: పిస్టల్‌తో కాల్చుకుని గరుడ్ కమాండో ఆత్మహత్య



Commando Sucide

భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గరుడ్ కమాండోను నైట్ డ్యూటీకి నియమించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Delhi: వరల్డ్ కప్ ఫైనల్ రోజున మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కారణం ఇదే..

బాధితుడు 23 ఏళ్ల యోగేష్ కుమార్ మహతోగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు భుజ్ ‘ఎ’ డివిజన్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ డిజె ఠాకోర్ తెలిపారు. యోగేష్ జార్ఖండ్ నివాసి కాగా.. భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో భారత వైమానిక దళం యొక్క గరుడ్ కమాండో ఫోర్స్ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. జార్ఖండ్‌లో నివసిస్తున్న అతని తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల అతను కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడని, దీంతో ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి..?

గరుడ్ కమాండో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుసుకున్న పోలీసు అధికారి మహేంద్ర ప్రతాప్ సింగ్.. అతన్ని జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహతో ‘లీడింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌స్‌మ్యాన్’గా పనిచేస్తున్నట్లు తెలిపారు.