Leading News Portal in Telugu

Delhi: వరల్డ్ కప్ ఫైనల్ రోజున మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కారణం ఇదే..



Dry Day In Delhi

Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్‌లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు.

Read Also: Lifestyle : అమ్మాయిలల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడేది ఇవే..

ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున ఢిల్లీ మందుబాబులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ రోజు మద్యం అమ్మకాలను నిషేధిస్తూ డ్రై డేగా పాటించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కిషన్ మోహన్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే మ్యాచుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజున ఢిల్లీ వ్యాప్తంగా ఛట్ పూజ నిర్వహించనున్నారు. సూర్యదేవుడిని కొలిచేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఛట్ పూజ చేస్తారు. ఉపవాస దీక్షలు చేపట్టి, సూర్యుడికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. కేవలం ఛట్ పూజ రోజున మాత్రమే కాదు, రాజధానిలో జాతీయ పర్వదినాలు, పండగల సందర్భంగా డ్రై డేగా పాటించి, మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు. ఢిల్లీలోని 637 మద్యం దుకాణాలు మార్చి 8 హోలీ రోజున, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దీపావళి రోజున మూసేశారు.