
Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.ఈ రోజు ఉదయం ఢిల్లీ లోని రోహిణి ప్రాంతంలో లోని సెక్టార్ -15 దగ్గర ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. బసుకు బోల్తా పడడం వల్ల బసు లోని ప్రయాయికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. కాగా ఈ ఘటనలో పలువురు ప్రయాయికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read also:Minister KTR: మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నా.. కూతురు పుట్టాక జీవితం మారింది..
ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) కి చెందిన ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడిందని.. స్థానికులు సమాచారం అందించారని. సంచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని.. కాగా బస్సు బోల్తా పడడం వల్ల కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. ప్రస్తుతం వాళ్లకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం పోలీసు బృందాలు ఘటన స్థలంలో ఉన్నాయి. ఈ ఘటన గురించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాలలో విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.