
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృత్త్యువాత పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. ఆదివారం రాజస్థాన్ లోని చురు జిల్లా లోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జుంజునులో నిర్వహించనున్న ప్రధాని ర్యాలీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నివేదికల సమాచారం ప్రకారం.. నాగౌర్‌లోని ఖిన్‌వ్సర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరుగురు పోలీసులు అలానే మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు జుంజునులో నిరవహించనున్న ప్రధాని ఎన్నికల సమావేశానికి విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైలో కారులో ఝుంఝునుకు బయలుదేరారు. కాగా కారు సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కనుటా పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 58పై ట్రక్కును ఢీకొట్టింది.
Read also:Bandi Sanjay: కేసీఆర్ సారూ.. 31 ప్రశ్నలకు జవాబు చెప్పి ఓట్లు అడగండి..
తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ఛిద్రమై ముక్కలైంది. దీనితో కారు లోని 6 మంది అక్కడిక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా మృతి చెందిన పోలీసులు ఖిన్‌సర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ రాంచంద్ర, కానిస్టేబుల్ కుంభారం, సురేష్ మీనా, తానారామ్, మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మహేంద్రగా గుర్తించారు. కాగా కానిస్టేబుల్ సుఖరామ్ గాయపడగా.. వారిని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కాగా ఈ ఘటన పై డీజీపీ ఉమేష్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.