Leading News Portal in Telugu

UFO: ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టుపై గుర్తుతెలియని వస్తువు కలకలం.. రంగంలోకి రఫేల్‌



Imphal Airport

UFO: ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో ‘అజ్ఞాత ఎగిరే వస్తువు’ (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించింది. హసిమారా వైమానిక స్థావరం నుంచి ప్రయోగించిన రఫేల్‌లు యుద్ధ విమానాలు దేనిని గుర్తించలేకపోయాయని ఉన్నత వర్గాలు తెలిపాయి. మొదటి విమానం స్థావరానికి తిరిగి వచ్చింది. రెండవది మళ్లీ తనిఖీ చేయడానికి ప్రాంతం వైపు మోహరించబడింది, కానీ అది దేనినీ నిర్ధారించలేకపోయింది. ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది.

Also Read: Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

“ఇంఫాల్ విమానాశ్రయం నుంచి విజువల్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఐఏఎఫ్ దాని ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసింది. ఆ తర్వాత చిన్న వస్తువు కనిపించలేదు” అని ఆదివారం ట్వీట్ చేసింది. “సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్‌ఫీల్డ్ పశ్చిమం వైపు కదులుతున్న గుర్తు తెలియన వస్తువు ఒకటి ఎగురుతూ కనిపించింది” అని CISF అధికారి ఒకరు తెలిపారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించడంతో కొన్ని గంటలపాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

దారి మళ్లించబడిన విమానాలలో కోల్‌కతా నుండి ఇండిగో విమానం కూడా ఉంది. 25 నిమిషాల తర్వాత గౌహతికి మళ్లించారు.ఆలస్యమైన విమానాలు దాదాపు మూడు గంటల తర్వాత క్లియరెన్స్ పొందిన తర్వాత ఇంఫాల్ విమానాశ్రయం నుంచి బయలుదేరాయి. షిల్లాంగ్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్‌కు కూడా ఈ పరిణామం గురించి సమాచారం అందించారు.