Leading News Portal in Telugu

Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై



Man Killed Son

Delhi Father Kills His Son: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు ఒడిగట్టాడు ఓ తండ్రి. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మరణించగా.. మరో బాలుడు, ఆ తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. వాయుయ్య ఢిల్లీలోని భరత్ నగర్ వజీర్‌పూర్ జేజే కాలనీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాకేష్ (35) భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాకేష్‌ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాకేష్ తన ఐదేళ్ల పెద్ద కుమారుడు, రెండేళ్ల చిన్న కుమారుడితో కలిసి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

Also Read: RK Roja: మాజీ మంత్రి బండారుపై రోజా పరువు నష్టం దావా

ఓ పదునైన కత్తితో తన ఇద్దరు కుమారుల గొంతు కోసి అదే కత్తితో తాను ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. అనంతరం గది నుంచి బయటకు వచ్చి భార్యతో అసలు విషయం చెప్పాడు రాకేష్. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా అప్పుటికే అతడి రెండేళ్ల చిన్న కుమారుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇక విషయ పరిస్థితిలో ఉన్న రాకేష్, అతడి పెద్ద కుమారుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం రాకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఉద్యోగం లేని రాకేష్ తాగుడుకు బానిసయ్యాడని, దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడని పోలీసు అధికారి తెలిపారు. సోమవారం కూడా తాగి భార్యతో గొడవ పడిన రాకేష్ కోపంలో ఇద్దరు కుమారుల గొంతు కోసి ఆపై అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ “చెడు శకునం”.. అందుకే భారత్ ఓడిపోయింది..