Leading News Portal in Telugu

Supreme Court: ఢిల్లీ వాయిు కాలుష్యం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్.. రైతులను విలన్లుగా చూపోద్దు..



Sc

వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది.

Also Read: Uttar Pradesh: బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్‌మెయిల్ చేసిన భార్య..

రైతులు పంట వ్యర్థాలను కాల్చడానికి ఎన్నో కారణలు ఉండోచ్చని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వాయు కాలుష్యంపై రైతులను విలన్లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం, డిజిల్ ఖర్చులు వంటి కారణాలు వారికి ఉండోచ్చు. కానీ వ్యర్థాలు కాల్చకుండ అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలాదే. వాటినికి ప్రత్యామ్నయంగా ప్రభుత్వాలు ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా? దానికి మీరు ఏం చేస్తున్నారు’ అని సుప్రీం కోర్టు మండిపడింది.

Also Read: Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై

ఈ విషయంలో యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు హర్యాయానను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంది. యంత్రాంగానికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించడంలో నిందలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపింది. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు పోరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని చెప్పింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడంపై నివేదిక ఇవ్వాలని యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించి.. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.