Wedding Season: ఈ సీజన్లో 38 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని కోట్ల వ్యాపారమో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..!

Wedding Season: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి మ్యారేజీలు మరింత ఊపందుకోనున్నాయి.. రేపటి నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు దేశీయంగా పెద్ద సంఖ్యలు పెళ్లిళ్లు జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో 38 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగబోతున్నాయట.. పెళ్లిళ్లు అంటే మామూలు విషయమేమీ కాదు.. ‘ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు’ అనే సామెత కూడా ఉంది.. అంటే.. ఈ రెండింటికీ జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఇక, వారి ఆర్థికస్తోమతకు తగ్గట్టు ఈ రెండు కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు.
Read Also: Chiyaan Vikram: చప్పుడు చెయ్యట్లేదు ఏంటి? మళ్లీ వాయిదానా?
ఈ పెళ్లిళ్ల సీజన్లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు, సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్లు కాయిట్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
Read Also: Israel Palestine Conflict: 50 మంది బందీలకు బదులుగా 150 మంది పాలస్తీనా ఖైదీలు.. కుదిరిన డీల్
అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెళ్లిళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది.. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో 32 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగ్గా.. ఈ సమయంలో దాదాపు రూ.3.75 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగిందట.. కానీ, ఈ ఏడాది పెళ్లిళ్ల సంఖ్యతో పాటు ఖర్చు కూడా భారీగా పెరగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.. 19వ తేదీన రికార్డు సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయని చెబుతున్నారు.. అయితే, ఈ నెల 23, 24, 27, 28, 29 తేదీలతో పాటు.. డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహ శుభఘడియలు అధికంగా ఉన్నాయని.. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని కాయిట్ పేర్కొంది.. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని, రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడి జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.