Leading News Portal in Telugu

Bengaluru: కూతురిని వేధిస్తున్నాడని దారుణంగా చంపేసిన తండ్రి.. అరెస్ట్ చేసిన పోలీసులు..



Benguluru

కర్ణాటక బెంగుళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.. తన కూతురిని వేధిస్తున్నాడన్న ఆరోపణతో 21 ఏళ్ల యువకుడిని హత్య చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.. బాధితుడిని విల్సన్ గార్డెన్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు..

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఆనేపాల్యలో నివసిస్తున్న మంజునాథ్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడికి ముగ్గురు పిల్లలు.. అతని రెండో కుమార్తె తో డేవిడ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు.. అతన్ని గత కొద్ది రోజులుగా ఫాలో అవుతూ వచ్చాడు.. ఇటీవల మంజునాథ్ వీరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించి మంజునాథ్‌ను హెచ్చరించాడు. తన కూతురితో సంబంధం కొనసాగించవద్దని సలహా కూడా ఇచ్చాడు. అయినప్పటికీ, డేవిడ్ ఆమెకు ఫోన్‌లో కాల్ చేస్తూనే ఉన్నాడు.. తనతో శారీరకంగా కలవకుంటే ఇద్దరం కలిసిన ఫోటోలను తన, ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు..

ఈ విషయాన్ని వెంటనే తన తండ్రికి చెప్పింది.. అతని తీరు మారలేదని మళ్లి రమ్మని బెదిరిస్తున్నట్లు ఆదివారం తన తండ్రికి చెప్పింది.. అతనికి మరోసారి వార్నింగ్ ఇచ్చాడు మంజునాథ్.. కానీ వినలేదు.. దాంతో సుబ్బన్న గార్డెన్‌ సమీపంలో డేవిడ్‌ను కలవాలని మంజునాథ్‌ కోరాడు. కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో గొడవ జరిగి మజునాథ్ డేవిడ్‌పై కత్తితో దాడి చేశాడు.. తీవ్ర రక్త స్రావం కావడం తో అక్కడిక్కడే మృతి చెందాడు… స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి మంజునాథ్ ను అదుపులోకి తీసుకున్నారు..ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..