Leading News Portal in Telugu

Delhi High Court: సంపాదన సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి ఖాళీగా కూర్చోలేరు.. భరణం కేసులో కీలక వ్యాఖ్యలు..



Delhi High Court

Delhi High Court: విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన సంపాదించగల సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి, తగిన వివరణ లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా ఉండకూడదని, తన ఖర్చులను భర్త ఏకపక్షంగా భరించడానికి అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కోర్టు విచారణలో, సదరు మహిళ ఇండిపెండెంట్ ఇన్‌కమ్ సోర్సెస్ లేవని, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పొందిందని, సహేతుకమైన విద్యా నేపథ్యం ఉందని పేర్కొంది. అర్థవంతమైన ఉపాధి పొందడానికి ఎలాంటి ఆటంకం లేనప్పటికీ ఆమె స్వచ్ఛందంగా సోషల్ వర్క్ చేపట్టినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.

ఆమెకు సంపాదించే సామర్థ్యం ఉంది, అయితే ఎలాంటి తగిన వివరణ లేకుండా ఉద్యోగం కోసం నిజాయితీగా కృషి చేస్తున్నట్లు లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా, భాగస్వామి ఖర్చులను భరించే బాధ్యతతో అవతలి పక్షాన్ని(భర్త)ను నిలబెట్టడాన్ని అనుమతించకూడదని న్యాయమూర్తులు వీ కామేశ్వర్ రావు, అనూప్ కుమార్ మెండిరట్టలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Read Also: Vaishnav Tej: హీరోయిన్ రీతూ వర్మతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్

భరణం కింద నిబంధనలను లింగ తటస్థంగా ఉన్నాయని, చట్టంలోని సెక్షన్ 24, 25లు ఇద్దరి మధ్య వివాహం నుంచి ఉత్పన్నమయ్యే హక్కులు, బాధ్యతలను తెలియజేస్తాయని పేర్కొంది. విడిపోయిన భార్యకు నెలవారీ భరణం రూ. 30,000, వాజ్యం ఖర్చులను రూ. 51,000 చెల్లించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. మహిళకు నెలవారీ భరణ రూ. 21,000 చెల్లించాలని గతంలో ట్రయల్ కోర్టు తనను కోరిందని, అయితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకుండా దాన్ని రూ. 30,000 పెంచిందని చెప్పారు.

తనకు రూ. 47,000 చేతికి వస్తుందని, తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఉందని, నెలకు రూ.30,000 చెల్లించడం తనకు సాధ్యం కాదని సదరు వ్యక్తి కోర్టుకు చెప్పారు. అయితే తాను కేవలం సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నానని, ఆస్పత్రి నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదని మహిళ చెప్పింది.

ఈ జంటకు 2018లో వివాహం చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా జూలై 2020లో భర్త నుంచి విడిపోయి భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. వాస్తవాలను పనరిగణలోకి తీసుకుని పురుషుడు ఇతర కుటుంబ సభ్యుల పట్ల అతని విధులతో పాటు బాధ్యతలను విస్మరించలేమని హైకోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టులో పిటిషన్ పరిష్కరించే వరకు మహిళకు నెలకు రూ. 21,000 భరణం సహేతుకంగా ఉంటుందని, ఆమెకు వాజ్యం ఖర్చులను చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే, విడాకుల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న సమయంలో నెలకు రూ. 1,500 చొప్పున తదుపరి ప్రతి సంవత్సరానికి మెయింటనెన్స్ పెంచబడుతుందని పేర్కొంది.