
Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్‌లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నీలేష్ దల్సానియా అనే 21 ఏళ్ల దళిత యువకుడు రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ యజమాని విభూతి పటేల్ నీలేష్ ని అక్టోబర్ ప్రారంభంలో పనిలోకి తీసుకుంది. నెలకు రూ. 12,000 జీతం ఇస్తానని చెప్పింది. అయితే అతడిని అక్టోబర్ 18న పని నుంచి తీసేశారు. అయితే తాను పనిచేసిన 16 రోజులకు జీతం ఇవ్వాలని నీలేష్ కోరినప్పుడు విభూతి పటేల్ ఏం చెప్పకుండా, అతనితో కమ్యూనికేషన్ కట్ చేసింది.
Read Also: Nani: సినిమా అనేది నాకు ఆక్సిజన్.. దానిపై మీద ఒట్టేసి చెబుతున్నా… మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది!!!
అయితే బుధవారం సాయంత్రం నిలేష్ అతని సోదరుడు, పొరుగువారితో కలిసి విభూతి పటేల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో వ్యాపారవేత్త సోదరుడు ఓంపటేల్, అతని సహచరులు నీలేష్ పై దాడి చేశారు. ఈ ఘటనలో విభూతి పటేల్ చెప్పుతో కొట్టి, ఆఫీస్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఉద్యోగులతో కొట్టించింది. అంతటితో ఆగకుండా చెప్పును నోటిలో పెట్టుకోవాలని బలవంతం చేసింది, జీతం డిమాండ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, మరోసారి కంపెనీ పరిసరాల్లో తిరగకూడదని వార్నింగ్ ఇచ్చింది.
ప్రస్తుతం నిలేష్ దల్సానియా మోర్బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బు దోపిడికి వచ్చినట్లు నీలేష్ ను ఒప్పుకోవాల్సిందిగా బలవంతం చేశారు. నిందితులందరిపై అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రతిపాల్ సిన్హాజాలా తెలిపారు. నిందితులందరి ఇంట్లో సోదాలు చేసినప్పుడు ఎవరూ లేరని, వారి కోసం మూడు టీంలతో వెతుకుతున్నట్లు తెలిపారు.