Leading News Portal in Telugu

Rajasthan: దాగుడుమూతలు ఆడుతూ.. ఫ్రీజర్‌లో దాక్కుని ఇద్దరు మృతి



Freezer

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్‌సమంద్ జిల్లాలో ఘోరం జరిగింది. దాగుడు మూతలు ఆడుతూ ఇద్దరు బాలికలు మరణించారు. ఐస్ క్రీం ఫ్రీజన్‌లో చిక్కుకోవడంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఖమ్నేర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Monkeypox: కాంగోలో మంకీపాక్స్.. లైంగికంగా వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ నిర్థారణ..

Read Also: Minister KTR: కేసీఆర్ రాజకీయ జీవితంతో బీజేపీతో ఏనాడు పొత్తు పెట్టుకోలేదు..

Read Also: The Village OTT: ఆర్య ‘ది విలేజ్‌’ ఓటీటీ లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్?

బంధువైన ఇద్దరు బాలికలు ఇంట్లో దాగుడుమూతలు ఆడుతూ.. ఉపయోగించని ఫ్రీజర్లో దాక్కున్నారు. పాయల్(10), రితిక(11) అనే ఇద్దరు ఫ్రీజర్‌లో దాక్కుని డోర్ మూసేయడంతో అందులో చిక్కుకుపోయారు. అయితే పిల్లలిద్దరు కనిపించకపోవడంతో వారి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా లాభం లేకపోయింది. అయితే చాలా సేపటి తర్వాత ఫ్రీజర్‌లో చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ఊపిరాడకపోవడంతో ఇద్దరు మరణించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.