Leading News Portal in Telugu

Chandra Grahan 2024: వచ్చే ఏడాది భారత్ లో మొదటి చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..?


Chandra Grahan 2024: వచ్చే ఏడాది భారత్ లో మొదటి చంద్రగ్రహణం.. ఎప్పుడంటే..?

గత సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవించగా, వచ్చే ఏడాది 2024లో మొత్తం 5 గ్రహణాలు సంభవించనున్నాయి. ఈ గ్రహణాలలో మొదటిది చంద్రగ్రహణం. ఈ గ్రహణం పెనుంబ్రల్ గ్రహణం( సూక్ష్మం ) ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క కక్షలోకి ప్రవేశించినప్పుడు భూమి యొక్క అసలు నీడలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం వస్తుంది. దీని వలన గ్రహణం ఏర్పడుతుంది. అందుకే దీనిని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. 2024లో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది.. ప్రపంచంలోని ఏఏ ప్రాంతాల ప్రజలు దీనిని చూడగలరో తెలుసుకుందాం..

అయితే, గ్రహణం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఖగోళ సంఘటన. దీన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. రాబోయే సంవత్సరంలో, మార్చి 24, 25 తేదీలలో పెనుంబ్రల్ ( సూక్ష్మం ) చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ చంద్ర గ్రహణాన్ని యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలు, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల ప్రజలు చూడవచ్చు.. అలాగే, ఈ చంద్ర గ్రహణాన్ని ఆసియాలోని కొన్ని ప్రాంతాల నుండి చూడవచ్చు కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. గ్రహణానికి కొన్ని గంటల ముందు సూతక్ కాల్ ప్రారంభమవుతుంది. సూతక్ కాలం అశుభంగా భావించే సమయం.. ఈ కాలంలో చాలా పనులు నిలిచిపోతాయి. భారతదేశంలో చంద్ర గ్రహణం కనిపించదు.. దాని వల్ల సూతక్ కాలం భారత్ లో ఉండదు.

ఇక, 2024లో గ్రహణాలు ఎప్పుడు వస్తాయంటే..?
* 2024లో మొత్తం 5 గ్రహణాలు ఏర్పడుతున్నాయి.
* మొదటి గ్రహణం చంద్రగ్రహణం మార్చి 24, 25 రాత్రికి పెనుంబ్రల్ చంద్ర గ్రహణం
* రెండవది సూర్యగ్రహణం.. ఏప్రిల్ 8న కనిపిస్తుంది.. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం
* మూడోది గ్రహణం చంద్రగ్రహణం.. సెప్టెంబర్ 17-18 రాత్రికి కనిపిస్తుంది.. ఈ గ్రహణం పాక్షిక చంద్రగ్రహణం
* నాల్గవది గ్రహణం అక్టోబర్ 2న సంభవిస్తుంది.. ఇది వార్షిక సూర్యగ్రహణం
* 2024 చివరి గ్రహణం అక్టోబర్ 17న చంద్రగ్రహణం కనిపించనుంది..