Leading News Portal in Telugu

Wife Kills Husband: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..


Wife Kills Husband: బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..

Wife Kills Husband: భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.

కన్‌స్ట్రక్షన్ రంగంలో వ్యాపారిగా ఉన్న నిఖిల్ ఖన్నా అనే వ్యక్తి తన రేణుక(38) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నిఖిల్ రేణుకను ఆమె పుట్టిన రోజు జరుపుకోవడానికి దుబాయ్ తీసుకెళ్లకపోవడంతోనే దంపతుల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పుట్టిన రోజు ఆమెకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వలేదని, కొంతమంది బంధువుల పుట్టినరోజు జరుపుకునేందుకు ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నప్పటికీ సానుకూలంగా స్పందించలేదని భార్య రేణుక మనస్తాపం చెందింది.

ఈ గొడవల కారణంగా నిఖిల్ ముఖంపై రేణుక కొట్టిందని, ఆ పంచ్ తాకిడికి నిఖిల్ ముక్కు, కొన్ని పళ్లు విరిగిపోయాయని, తీవ్ర రక్తస్రావం కావడంతో నిఖిల్ స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. రేణుకపై ఐపీసీ సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారు.