Leading News Portal in Telugu

Odisha: ప్రియురాలని 31 ముక్కలుగా నరికిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..?


Odisha: ప్రియురాలని 31 ముక్కలుగా నరికిన ప్రియుడు.. అసలేం జరిగిందంటే..?

Odisha: ప్రేమించడం తప్పు కాదు..కానీ.. సరైన వ్యక్తిని ప్రేమించకపోతేనే ముప్పు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఓ వ్యక్తి తనను ప్రేమించిన యువతిని హత్య చేసి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఒడిశా లోని నబరంగ్‌పూర్ జిల్లా నివాసి అయిన ఓ గిరిజన బాలిక ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్ళై 5 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే బుధవారం ఇంటి నుండి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీనితో కంగారు పడిన యువతి తల్లిదండ్రులు ఆ యువతి కోసం అన్ని చోట్ల వెతికారు.అయిన ఆ యువతి జాడ కనిపించలేదు. దీనితో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదో చేసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసారు. చివరికి బరంగ్‌పూర్ జిల్లా లోని అడవి లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

Read also:Bigg Boss 7 Telugu: హౌస్ నుంచి అశ్విని ఎలిమినేట్.. ఎన్ని లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?

కాగా ఆ మృత దేహాన్ని 31 భాగాలుగా నరికి, భూగర్భంలో పాతిపెట్టగా.. పోలీసుల విచారణలో శరీర భాగాలు బయటపడ్డాయి. అనంతరం ఆ శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రాయ్‌ఘర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) ఆదిత్య సేన్ మాట్లాడుతూ.. యువతి బుధవారం ఇంటి నుండి బయలు దేరి తాను ప్రేమించిన వ్యక్తి ఇంటికి వెళ్లిందని.. అనంతరం తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తిని ఒత్తిడి చేయసాగిందని.. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి తన భార్యతో కలిసి హత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నాం అని తెలిపారు. అలానే అనుమానితులైన భార్యభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మరణించిన యువతి వయసు కేవలం 20 సంవత్సరాలు కావడం బాధాకరం. 20 సంవత్సరాలకే కూతురు మరణించడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.