Leading News Portal in Telugu

Chandrayaan 3: చంద్రయాన్ 3 సక్సెస్.. బిలియనీర్ల జాబితాలో చేరిన 60 ఏళ్ల ఇంజనీర్


Chandrayaan 3: చంద్రయాన్ 3 సక్సెస్.. బిలియనీర్ల జాబితాలో చేరిన 60 ఏళ్ల ఇంజనీర్

Electrical Engineer Become Billionaire: చంద్రయాన్ 3 సక్సెస్‌తో చరిత్రలో భారత్ కొత్త అధ్యాయనం లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో భారత్‌కు ప్రపంచమే సెల్యూట్ కొట్టింది. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ భారత్ కీర్తిని పెంచడమే కాదు.. ఇస్రో సైంటిస్టులకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతోంది. అయితే చంద్రయాన్ 3 సక్సెస్ ఓ వ్యక్తిగా భారీగా కలిసోచ్చింది. ఏకంగా అతడు బిలియర్‌గా మారిపోయాడు. చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇండియన్ ఇంజనీర్ బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. ఇంతకి ఆయన ఎవరంటే.. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్, మైసూర్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కున్హికన్నన్.

చంద్రయాన్ 3 రోవర్, ట్యాండర్ రెండింటికి అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టిమ్‌లను అందించి చంద్రయాన్ 3 మిషన్ విజయంలో భాగమయ్యారు. చంద్రయాన్ 3 తర్వాత కేన్స్ టెక్నాలజీ ఇండియా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అరంగేట్రం చేసింది. దీంతో కేన్స్ షేర్లు భారీగా పెరిగాయి. కేన్స్‌లో 64 శాతం వాటా ఉన్న రమేష్ కున్హికన్నన్ ఆస్తులు భారీగా పెరిగిపోయింది. అలా ఆయన నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ. ఈ మేరకు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతున్నట్టు పేర్కొంది.

ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరఫరా చేస్తుంది. కాగా మైసూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యూయేట్ చేసిన రమేష్ కున్హికన్నన్ 1988లో కేన్స్‌ను స్థాపించి కాంట్రాక్ట్ పద్దితిలో ఎలక్ట్రానిక్ పరికరాలను అందించారు. ఆయన భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం కేన్స్ ఛైర్ పర్సన్‌‌గా వ్యవహరిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా వారికి బాగా ఉపయోగపడింది. . స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ఈ ప్రొగ్రాంతో భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగింది. దీంతో 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.