Leading News Portal in Telugu

World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..


World Cup: ఫైనల్‌లో భారత్ ఓటమిపై సంబరాలు.. కాశ్మీరీ స్టూడెంట్స్‌పై “ఉపా” కేసు..

World Cup: భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతితో భారత్ ఓడిపోయింది. ఈ బాధ నుంచి ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కోలుకోలేకపోతున్నారు. అయితే భారత ఓటమిపై పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మన దేశంలో కూడా ఇలాంటి జాతి వ్యతిరేకులు ఉన్నారు. భారత్ ఓడిపోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు, తినేది ఈ దేశ తిండి కానీ వేరే దేశానికి మద్దతు తెలుపుతున్నారు.

ఇలాగే భారత్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుని, భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు జమ్మూ కాశ్మీర్ లోని ఓ యూనివర్సిటీకి చెందిన ఏడుగురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. అత్యంత కఠినమైన ‘‘చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం(UAPA)’’ కింద అరెస్ట్ చేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన కాశ్మీర్ విద్యార్థులు షేర్-ఇ-కాశ్మీర్ యూనివర్సిటతతీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(SKUAST)లో చదువుతున్నారు. వీరిపై ఉపా, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. కొందరు రాజకీయ నేతలు ఈ అరెస్టులను తప్పుపట్టారు.

ఈ సంఘటనలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడమే కాకుండా.. ఇది భారత అనుకూలంగా ఉండేవారిని, పాకిస్తాన్ వ్యతిరేక భావాల ఉండే వారిని భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఈ సంఘటనకు వ్యతిరేకం ఫిర్యాదులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ చర్యల్ని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఖండిచారు. ఈ సమస్యను పరిశీలించాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను అభ్యర్థించారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే ఉపా చట్టాన్ని ప్రభుత్వం యువత, జర్నలిస్టులు, విద్యార్థులపై ఉపయోగిస్తోందని మండిపడ్డారు. కొంతమంది విద్యార్థులు ఆస్ట్రేలియా విజయాన్ని సంబరాలుగా చేసుకుంటే తప్పా.? అని ప్రశ్నించారు. కాశ్మీర్ ప్రజల మనసులను గెలుచుకోవాలని.. ఎంత మందిని జైళ్లో పెడతారని అడిగారు. ఐడియాలజీని పంజరంలో బంధించలేరని అన్నారు.

పంజాబ్‌కి చెందిన స్థానికేతర విద్యార్థి టీమ్ ఇండియాకు మద్దతు ఇచ్చినందుకు నిందితులైన విద్యార్థులు తిడుతూ.. బెదిరించారని ఫిర్యాదు చేశాడు. కాశ్మీరీ విద్యార్థులు భారత ఓటమిని సంబరాలుగా చేసుకున్నారని, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.