Leading News Portal in Telugu

Chennai-Pune Train: చెన్నై-పూణే ట్రైన్‌లో కలుషిత ఆహారం.. 40 మంది ప్రయాణికులకు అస్వస్థత..



Chennai Pune Train

Chennai-Pune Train: చెన్నై నుంచి పూణే వెళ్తున్న భారత్ గౌరవ్ ట్రైన్‌లో కలుషిత ఆహారం అందించినట్లు తెలుస్తోంది. ట్రైన్‌లో కలుషిత ఆహారం తిన్న 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ అయింది. రైల్వే మంత్రిత్వశాఖలోని కొన్ని వర్గాల సమచారం మేరకు ఓ ప్రైవేట్ సంస్థ ట్రైన్‌లో ఫుడ్ సర్వీస్ నిర్వహిస్తుంది. సదరు కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు రైల్వే మంత్రిత్వశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్‌కి గల కారణాలు ఇంకా నిర్ధారించలేదు. తదుపరి విచారణ కోసం ఫుడ్ శాంపిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా కొన్ని రైళ్లలో ఇదే తరహాలో కలుషిత ఆహారాన్ని ప్రయాణికులకు అందించడం వివాదస్పదమైంది.