Leading News Portal in Telugu

Priyanka Gandhi: మా తల్లులారా.. పిల్లలారా అంటూ తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు..


Priyanka Gandhi: మా తల్లులారా.. పిల్లలారా అంటూ  తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు..

Telangana Assembly Election 2023: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు పారంభమైంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈ క్రమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, అలానే రాహుల్ గాంధీ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు. X (ట్విట్టర్) వేదికగా ప్రియాంక గాంధీ, అలానే రాహుల్ గాంధీ స్పందించారు. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణా లో అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటర్లను చైతన్య వంతులను చేసేలా ప్రియాంక గాంధీ, అలానే రాహుల్ గాంధీ X వేదికగా ట్వీట్ చేశారు.

Read also:Telangana Elections 2023: ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం.. కారణం ఏంటంటే?

ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ లో నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా..పిల్లలారా.. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత.. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి.. అభినందనలు.. జై తెలంగాణ..జై హింద్ అని రాసుకొచ్చారు.. కాగా రాహుల్ గాంధీ ఈ రోజు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.. నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి.. కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.