Leading News Portal in Telugu

UP man marries Dutch girl: నెదర్లాండ్స్ అమ్మాయితో యూపీ వ్యక్తి లవ్.. హిందూ ఆచారాలతో పెళ్లి..


UP man marries Dutch girl: నెదర్లాండ్స్ అమ్మాయితో యూపీ వ్యక్తి లవ్.. హిందూ ఆచారాలతో పెళ్లి..

UP man marries Dutch girlfriend: ఇటీవల కాలంలో ఇండియన్ అబ్బాయిలు ఫారిన్ అమ్మాయిలను లవ్‌లో పడేస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో పరిచయాలతో తన లవర్‌ని కలుసుకునేందుకు ఏకంగా ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న ఇండియా అబ్బాయిలు, యూరప్, అమెరికా అమ్మాయిలకు నచ్చుతున్నారు. ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లిళ్లకు దారి తీస్తున్నాయి.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన హర్దీక్ వర్మ(32) నెదర్లాండ్స్‌కి చెందిన గాబ్రియేలా దుడా(21) అనే అమ్మాయిని ప్రేమించారు. బుధవారం ఈ జంట పెళ్లితో ఒకటరయ్యారు. వీరిద్దరు కూడా హిందూ సంప్రదాయాలతో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫతేపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే హర్దిక్ ఉద్యోగం కోసం నెదర్లాండ్స్ వెళ్లాడు. అక్కడే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తన సహోద్యోగి అయిన గాబ్రియేలాతో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. హర్దిక్ గాబ్రియేలాపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రిలేషన్‌లోకి వెళ్లారు.

మూడు ఏళ్లు కలిసి రిలేషన్‌లో ఉన్న తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత వారం స్వదేశానికి వచ్చిన ఈ జంటకు కుటుంబ సభ్యులు ఘనంగా వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 3న తన కుటుంబం ప్రస్తుతం ఉంటున్న గుజరాత్‌లోని గాంధీ నగర్‌కి వెళ్తామని హర్దిక్ చెప్పారు. ఫతేపూర్‌లో తమ పూర్వీకుల ఇళ్లు ఉండటంతోనే ఇక్కడ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్11న గాంధీనగర్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశామని, దీనికి గాబ్రియేలా తండ్రి మార్సిన్ దుడా, తల్లి బార్బరా దుడా, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. భారతదేశంలో వేడుకల తర్వాత ఈ జంట డిసెంబర్ 25న నెదర్లాండ్స్‌కి తిరిగి వెళ్లనున్నారు. అక్కడే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుగుతాయని హార్దిక్ తెలిపారు.