
2020ని ప్రపంచం ఎప్పటికీ మరవదు. అనూహ్యంగా మనమధ్యకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ పుట్టుక, మనుగడ తెలుసుకునేలోపే లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యాక్సినేషన్లు రావడంతో కరోనా నుంచి ఉపశమనం లభించింది. క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా మాత్రం పోలేదు. ఇంకా మహమ్మారి మన మధ్యే ఉంది. రీసెంట్‌గా మరోసారి ఈ మహమ్మారి మరోసారి బయటకు వచ్చింది. యూకేలో మార్పు పొంది కొత్త వెరియంట్‌తో విజఈంభించేసుందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌తో కొత్తగా 88 కరోనా కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: MLA TJR Sudhakar Babu: నువ్వెంత.. నీ బతుకెంత?.. లోకేష్‌పై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్
అంతేకాదు సూమారు 400 మంది ఈ వైరస్‌కు చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్య శాఖ తన వెబ్‌సైట్‌లో కరోనా కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో ఈ మహమ్మారి కారణంగా 5,33,300మంది ప్రాణాలు కోల్పోగా.. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103గా ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం ఉన్నట్టు చెప్పింది. అలాగే ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్లకు పైగా జనాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు అందించినట్టు తెలిపింది. అయితే ఇటీవల కరోనా పాజిటివ్‌లో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మృత్యువాత పడ్డంటు పేర్కొంది.
Also Read: MLC Kavitha: కేసీఆర్ మై హీరో.. త్రివిక్రమ్ డైలాగుతో కవిత వీడియో పోస్ట్