Leading News Portal in Telugu

Earthquake: లడఖ్‌లో భూకంపం.. 3.4 తీవ్రత నమోదు


Earthquake: లడఖ్‌లో భూకంపం.. 3.4 తీవ్రత నమోదు

Ladakh Earthquake: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాస్తంగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదోక ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. శనివారం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లో భూకంపం చోటుచేసుకోగా.. ఇదే రోజు లెహ్ లడఖ్‌లోనూ భూకంపం సంభవించడం గమనార్హం. ఇవాళ ఉదయం 8. 25 నిమిషాల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతో అక్కడ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీట‌ర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంది. ‘స్థానం: లడఖ్.. భూకంపం తీవ్రత: 3.4, 02-12-2023న లాడ‌ఖ్‌లో భూప్రకంపనలు సంభవించాయి. 08:25:38 IST, లాట్: 35.44; పొడవు: 77.36, లోతు: 10 కిలో మీట‌ర్లు’ అని ఎన్‌సీఎస్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.