Leading News Portal in Telugu

Ashok Gehlot: గెహ్లాట్ “మ్యాజిక్ ముగిసింది”.. బీజేపీ సెటైర్లు..


Ashok Gehlot: గెహ్లాట్ “మ్యాజిక్ ముగిసింది”.. బీజేపీ సెటైర్లు..

Ashok Gehlot: రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, సీఎం అశోక్ గెహ్లాట్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. మాంత్రికుడి మాయ నుంచి రాజస్థాన్ బయటపడిందని అశోక్ గెహ్లాట్‌పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ‘‘మాయాజాలం ముగిసింది మరియు రాజస్థాన్ మాంత్రికుడి మాయ నుండి బయటపడింది. మహిళల గౌరవం కోసం, పేదల సంక్షేమం కోసం ప్రజలు ఓట్లు వేశారని’’ అన్నారు.

కాంగ్రెస్ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ ఇంద్రజాలికుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మెజిషియన్, ఆయనకు సాయంగా ఉండేవారు గెహ్లాట్. కాంగ్రెస్ హమీలను అమలు చేయడంలో విఫలమైందని, అవినీతిలో కూరుకుపోన కాంగ్రెస్ పార్టీని తరమికొట్టడానికి ఓటేశారని షెకావత్ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 199 సీట్లు ఉంటే.. బీజేపీ 112 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ కేవలం 72 సీట్లకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ 2, ఇతరులు 13 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.