Leading News Portal in Telugu

Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు చేస్తామన్న అన్ని హామీలు నెరవేర్చుతాం..


Rahul Gandhi: తెలంగాణ ప్రజలకు చేస్తామన్న అన్ని హామీలు నెరవేర్చుతాం..

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓటములపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిందీ బెల్టులో కీలక రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోయింది. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందగా.. మధ్యప్రదేశ్‌లో ఏకపక్షంగా బీజేపీ, కాంగ్రెస్‌ని తుడిచిపెట్టింది.

ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నట్లు, ఐడియాలజీ యుద్ధం కొనసాగుతుందని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు చేస్తామన్న అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామమని చెప్పారు.

రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’, రేవంత్ రెడ్డి క్యాంపెనింగ్‌కి తోడు బీఆర్ఎస్ నాయకుల తీరు ఇలా అన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి కారణమయ్యాయని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ ఎన్నికలు దొరలకు, ప్రజలకు జరిగే యుద్ధమని తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం చేయడం, మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ చేసిన నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి.