Leading News Portal in Telugu

Baba Balaknath: రాజస్థాన్‌లో బీజేపీ విషయం.. మరో ‘యోగి’ రాబోతున్నాడా..?


Baba Balaknath: రాజస్థాన్‌లో బీజేపీ విషయం.. మరో ‘యోగి’ రాబోతున్నాడా..?

Baba Balaknath: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.

అయితే ఇదే విషయాన్ని ఆయనను అడగగా.. మా ప్రధాని బీజేపీకి కీలకం, ఆయన నాయకత్వంలో మేం పనిచేస్తాం, ముఖ్యమంత్రి ఎవరనేది కూడా పార్టీనే నిర్ణయిస్తుందని, ఎంపీగా సంతోషంగా ఉన్నానని, సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం దిగిపోనుంది. అయితే బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు తన ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించలేదు.

బాలక్ నాథ్ ముఖ్యమంత్రి అయితే, యోగి ఆదిత్యనాథ్ తర్వాత అత్యున్నత పదవిని అధిరోహించే మరో యోగి అవుతారు. యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్ల ప్రచారంలో బాలక్ నాథ్ కోసం ప్రచారం చేశారు. బాబా బాలక్ నాథ్, ఇమ్రాన్ ఖాన్‌పై పోటీ చేశారు. ఆయన దీనిని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌గా అభివర్ణించారు.