Leading News Portal in Telugu

PM Narendra Modi: మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?


PM Narendra Modi: మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం.. ప్రధాని మోడీ ఏమన్నారంటే..?

PM Narendra Modi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.

ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘‘ జన్తా జనార్థన్ అంటూ ఓటర్లను సంభోదించారు. మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి సంక్షేమం కోసం భాజపా అవిశ్రాంతంగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.’’ ఓటర్లకు నమస్కరిస్తున్నామని, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ ఫలితాలు భారతదేశ ప్రజలు సుపరిపాలన మరియు అభివృద్ధి రాజకీయాలకే పట్టం కట్టారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, వారి శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తామని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్)ద్వారా వెల్లడించారు.

సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలను చూస్తే.. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 164 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ లోని 199 స్థానాలకు గానూ 116 స్థానాల్లో, ఛత్తీస్ గఢ్ లోని 90 స్థానాలకు గానూ 56 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోంది.