Leading News Portal in Telugu

Soniya Gandhi: బుధవారం జైపూర్‌లో సోనియా నామినేషన్!


Soniya Gandhi: బుధవారం జైపూర్‌లో సోనియా నామినేషన్!

కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) వెళ్లడం ఖాయమైంది. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. వయసురీత్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ సాగింది. తాజాగా సోనియా రాజస్థాన్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. బుధవారం జైపూర్‌లో (Jaipur) సోనియా నామినేషన్ వేయనున్నారు. సోనియా నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొననున్నారు.


ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను వాయిదా వేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం తల్లి సోనియాతో కలిసి రాజ్యసభకు నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే బుధవారం బీహార్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో కూడా సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గే పాల్గొననున్నారు. ఇక రాహుల్ యాత్ర ఈనెల 16 నుంచి యూపీలో ప్రారంభం కానుంది.

సోనియాగాంధీ ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది.