Leading News Portal in Telugu

MSP: బీజేపీ ఏయే పంటకు ఎంత మద్దతు ధర పెంచింది..? రైతుల ఉద్యమ వేళ కేంద్రం ట్వీట్..


MSP: బీజేపీ ఏయే పంటకు ఎంత మద్దతు ధర పెంచింది..? రైతుల ఉద్యమ వేళ కేంద్రం ట్వీట్..

MSP: కేంద్రం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. 200 రైతు సంఘాలు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ వైపు ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో బారికేడ్లు, ముళ్ల కంచెల సాయంతో పోలీసులు, కేంద్ర బలగాలు వీరిని అడ్డుకున్నాయి.


ఇదిలా ఉంటే రైతు ఆందోళన నేపథ్యంలో కేంద్రం పలు పంటలకు మద్దతు ధరల్ని ఎంతమేర పెంచామనేది ఎక్స్(ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని, రైతుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని నినాదంతో, గత 10 ఏళ్లలో అన్నదాతల శ్రేయస్సుకోసం ఎంఎస్‌పీ గణనీయంగా పెంచినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో (2013-14), బీజేపీ పాలన(2023-24)లో ధరలను పోల్చారు.

మసూర్ దాల్:
2014-15లో మద్దతు ధర: రూ. 2950
2023-24లో మద్దతు ధర: రూ. 6425

వరి:
2014-15లో మద్దతు ధర: రూ. 1310
2023-24లో మద్దతు ధర: రూ. 2183

గోధుమ:

2014-15లో మద్దతు ధర: రూ. 1350
2023-24లో మద్దతు ధర: రూ. 2275

సజ్జలు:
2014-15లో మద్దతు ధర: రూ. 1250
2023-24లో మద్దతు ధర: రూ. 2500

మొక్కజొన్న:
2014-15లో మద్దతు ధర: రూ. 1310
2023-24లో మద్దతు ధర: రూ. 2090

శనిగలు:
2014-15లో మద్దతు ధర: రూ. 3100
2023-24లో మద్దతు ధర: రూ. 5230

జొన్నలు:
2014-15లో మద్దతు ధర: రూ. 1500
2023-24లో మద్దతు ధర: రూ. 3180

రాగి:
2014-15లో మద్దతు ధర: రూ. 1500
2023-24లో మద్దతు ధర: రూ. 3846