
BAPS Hindu Temple: ముస్లిం దేశంలో తొలి ఐకానిక్ బీఏపీఎస్ హిందూ ఆలయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే, అక్కడున్న హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతున్నారు.సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అద్భుత ఆలయాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఇనిస్టిట్యూట్ నిర్మించింది. ఈ ఆలయాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ సహకారం ఉంది.
కాగా, యూఏఈలో ప్రారంభిస్తున్న తొలి హిందూ దేవాలయం.. అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ మందిరం 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయం ప్రారంభానికి దాదాపు 2 నుంచి 5 వేల మంది భక్తులు టెంపుల్ ను సందర్శఇంచే ఛాన్స్ ఉందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ లో శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది డిసెంబర్ లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. క్రౌన్స్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆలయ నిర్మాణం కోసం 2015లో 13.5 ఎకరాల భూమిని విరాళంగా అందించారు.. 2019 జనవరిలో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం గిఫ్ట్ ఇచ్చింది. ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సుమారు 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు ( రూ. 700 కోట్లు ) అయ్యాయి.
ఇక, యూఏఈలో 27 ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయంలో భారతీయ శిల్పకళాసౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడుతుంది. ఈ ఆలయం ఎత్తు 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మందిర నిర్మించారు. ఈ ఆలయానికి ఏడు గోపురాలున్నాయి.. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ఈ గోపురాలు ప్రతీకగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ నిర్మాణంలో కాంక్రీట్, స్టీల్, సిమెంట్ వాడకుండా రాజస్థాన్ నుంచి తెప్పించిన పాలరాతిని వినియోగించారు.