Leading News Portal in Telugu

Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో రెండో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన..


Farmers Protest: ఢిల్లీ సరిహద్దులో రెండో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన..

Delhi Chalo: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతుంది. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇక, మంగళవారం నాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దీంతో ఈరోజు తిరిగి ఢిల్లీలో అడుగు పెట్టేందుకు కర్షకులు రెడీ అవుతున్నారు. వారందరూ ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచి ఉన్నారు. ఇక, శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


కాగా, రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో రేపటి (ఫిబ్రవరి 15) వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది. నిన్న (మంగళవారం) హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకోవడంతో.. ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.. దీంతో సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్‌లో పోలీసులు భారీ భద్రత కొనసాగుతోంది.