Leading News Portal in Telugu

Valentines Day: వీడేం ప్రియుడు.. ప్రియురాలిపై ఇదేం ప్రతాపం


Valentines Day: వీడేం ప్రియుడు.. ప్రియురాలిపై ఇదేం ప్రతాపం

ఫిబ్రవరి 14 అంటే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రియుడు.. ప్రియురాలు తమ ప్రేమను ఆయా బహుమానాలతో వ్యక్తపరుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం ఈరోజు సర్వసాధారణం. ఈరోజంతా ప్రేమే లోకంగా జీవిస్తుంటారు. ఈరోజు కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఈరోజు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే వార్త చదవాల్సిందే.


ఓ కాలేజీ ఆవరణలో ప్రేమికులిద్దరూ కలుసుకున్నారు. ఏవో బహుమానాలు ఇచ్చుకుంటారనుకుంటే అందుకు విరుద్ధంగా ప్రేమికుల తీరు కనిపించింది. ప్రియుడితో ఏదో మాట్లాడేందుకు ప్రియురాలి ప్రయత్నించింది. కానీ అతడు ఆమె దగ్గర నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అంతలో ఆమె.. ప్రియుడి షర్ట్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించింది. కానీ అతడు మాత్రం షాకిచ్చాడు. ఆమెను కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన హర్యానాలోని ఓ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

ఈ ఘటనను ఎవరో వీడియో తీసి  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనసై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి శాడిస్టులను కఠినంగా శిక్షించాలంటూ కొందరు… ఇలా ప్రవర్తించడం అమానుషంటూ మరికొందరు.. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.