Leading News Portal in Telugu

Bharat Bandh: నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..


Bharat Bandh: నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..

Farmers Protest: నేడు భారత్​ బంద్​ కు సంయుక్త కిసాన్​ మోర్చా సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా.. ఈ భారత్​ బంద్ ​ని అత్యంత కీలకంగా కర్షకులు తీసుకున్నారు. తమ డిమాండ్​లు నెరవేర్చేందుకు మోడీ సర్కార్ దిగిరావాలని ఆందోళన చెపట్టేందుకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని రైతన్నలు సిద్ధమయ్యారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు.. ఈ భారత్​ బంద్ లో పాల్గొని సక్సెస్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరింది.


ఇక, కేంద్ర ప్రభుత్వం తీరుపై రైతులు సంఘాలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా పంజాబ్​, హరియాణా నుంచి ఢిల్లీ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బారికేడ్లు వేసి భారీగా భద్రతా ఏర్పాట్లతో వారందరినీ ఢిల్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారు. అంతే, కాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్ గ్యాస్ ను సైతం ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న భారత్​ బంద్​ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేటి ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. అలాగే, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు.

ఇక, రైతులకు ప్రధానంగా ఆరు డిమాండ్​లు ఉన్నాయి..
1. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం.
2. రైతు రుణ మాఫీ.
3. స్వామినాథన్​ కమిషన్​ సిఫార్సుల అమలు.
4. 2020 విద్యుత్​ చట్టం ఉపసంహరణ.
5. లఖింపుర్​ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం.
6. గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
మరి రైతులు పిలుపునిచ్చిన