Leading News Portal in Telugu

Karnataka Budget 2024: వక్స్ బోర్డుకు 100 కోట్లు, క్రిస్టియన్లకు 200 కోట్లు.. హిందూ దేవాలయాలకు ఎంతంటే..?


Karnataka Budget 2024: వక్స్ బోర్డుకు 100 కోట్లు, క్రిస్టియన్లకు 200 కోట్లు.. హిందూ దేవాలయాలకు ఎంతంటే..?

CM Siddaramaiah: ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తులకు 100 కోట్ల రూపాయలు.. క్రైస్తవ సమాజానికి 200 కోట్ల రూపాయల కేటాయించగా.. హిందూ దేవాలయలకు వెళ్లే యాత్రా స్థలాల అభివృద్ధికి మాత్రం కేవలం 20 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు.


అయితే, రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత సీఎం, ఆర్థిక మంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 7.50 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 50 సంజీవని కేఫ్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ కేఫ్ లు మహిళలచే నిర్వహించబడుతుందన్నారు.. ఈ క్యాంటీన్లు పరిశుభ్రమైన, ఆరోగ్యాన్ని అందిచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సాంప్రదాయ ఆహారాన్ని అందిస్తుంది అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

కాగా, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని అమలు చేస్తున్నప్పుడు 14 శాతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఒకవేళ ఆదాయ వృద్ధి తగ్గితే.. రాష్ట్రాలు నష్టపరిహారం పొందుతాయి అనే విషయాన్ని పేర్కొన్నారు. అంచనా ప్రకారం, 14 శాతం వృద్ధి రేటుతో 2017 నుంచి 2023-24 వరకు GST పన్ను వసూళ్లు రూ. 4, 92, 296 కోట్లుగా అంచనా వేయగా.. కేవలం రూ. 3,26,764 కోట్ల GST ఆదాయం మాత్రమే రాష్ట్రానికి సమకూరింది అని తెలిపారు. అలాగే, జీఎస్టీ లోటుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,06,258 కోట్లు మాత్రమే పరిహారంగా తిరిగి ఇచ్చిందన్నారు. గత ఏడేళ్లలో జీఎస్టీ వ్యవస్థను తప్పుగా నిర్వహించడం వల్ల కర్ణాటక రాష్ట్రం రూ.59,274 కోట్ల నష్టాన్ని చవిచూసింది అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.