
Husband Kills Wife in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తలను అతికిరాతకంగా నరికేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. ఒక చేత్తో తలను, మరో చేత్తో కత్తిని పట్టుకుని అతడు రోడ్డుపై నడువడంతో అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన అనిల్ తాపీ మేస్త్రీ. అనిల్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ప్రస్తుతం అనిల్ దంపతులు కలిసి జీవించడం లేదు. ఇద్దరు వేరువేరుగా జీవిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అనిల్ తన భార్యను గురువారం అతికిరాతకంగా నరికి చంపేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు.
Also Read: Coach Jai Simha: నేను మద్యం సేవించలేదు.. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను: కోచ్ జై సింహా
ఇలాంటి సంఘటనే బుధవారం (ఫిబ్రవరి 14) పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్య మొండాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు. కుటుంబ సమస్యల కారణంగా గౌతమ్ గుచ్చైత్ అనే నిందితుడు తన భార్య ఫూల్రాణిని నరికి చంపాడు. అంతేకాకుండా భార్య మొండాన్ని పట్టుకుని రోడ్డుపై గౌతమ్ ఊరేగించాడు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.