Leading News Portal in Telugu

Sourav Ganguly: బెంగాల్ బీజేపీ చీఫ్‌ను పరామర్శించిన గంగూలీ



Gan

బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌‌ను (Sukanta Majumdar) ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పరామర్శించారు. సాల్ట్‌లేక్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా మజుందార్‌ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో నాయకత్వం వహిస్తూ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. తాజాగా గంగూలీ కూడా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే మజుందార్‌ను ఈరోజు తెల్లవారుజామున ఐసీయూ నుంచి అపోలో ఆస్పత్రి సాల్ట్ లేక్ కోల్‌కతాలోని డేకేర్ భవనంలోని ఓ గదికి తరలించారు.