Leading News Portal in Telugu

BJP Meeting: నేటి నుంచి రెండ్రోజుల పాటు బీజేపీ సమావేశాలు.. టార్గెట్ @400



Bjp

BJP National Council meeting: మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 17) ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం కాబోతుంది. ఉదయం జరిగే ఈ మీటింగ్ లో ప్రధాని మోడీతో సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర పార్టీ అతిరథ మహారధులు పాల్గొననున్నారు. అలాగే, నేటి (ఫిబ్రవరి 17) మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో రెండు రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభం అవుతాయి.

Read Also: Telangana Assembly: నేడే తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల..

ఇక, ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నిర్దేశించుకున్న 370 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు 400 స్థానాలకు పైగా ఎన్డీయే కూటమి గెలుస్తుందనే పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. ఇక, బీజేపీ విధానాలు, దేశహితం, సాధించిన దేశ పురోగతి, దేశ సమగ్రాభివృద్ధి, ముందున్న సవాళ్ళు, లక్ష్యాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు.

Read Also: Isha Ambani : అంబానీ కూతురికి దక్కిన అరుదైన గౌరవం

అయితే, రాజకీయ, సామాజిక, ఆర్ధిక, అంతర్జాతీయ సత్సంబంధాలు లాంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాల ద్వారా ఆమోదం తెలిపనున్నారు. 10 ఏళ్ళు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు.. తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో భారతదేశం సాధించిన ప్రగతితో ఆవిష్కృతమైన “వికసిత్ భారత్”కు హాజరైన ప్రతినిధులకు వివరించనున్నారు. ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపి నడ్డా ప్రారంభోపన్యాసంతో రెండు రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభం కానుండగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముగింపు ఉపన్యాసంతో పరిసమాప్తం కానుంది. ఇక, ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చెందిన దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు, పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు.