Leading News Portal in Telugu

Chhattisgarh: సీఏఎఫ్ జవాన్‌ని గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు..



Chhattisgarh

Chhattisgarh: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) 4వ బెటాలియన్‌కి చెందిన తిజౌ రామ్ భూర్యను కిరాతకంగా చంపారు. ఇతను కంపెనీ కమాండర్‌గా పనిచేస్తు్న్నాడు. నక్సలైట్లు భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన బీజాపూర్‌లో చోటు చేసుకుంది.

Read Also: Supreme Court: “గృహిణి విలువ ఎంతో ఉన్నతం”.. ఆమె జీతం తెచ్చే ఉద్యోగి కన్నా తక్కువేం కాదు..

జిల్లాలోని మార్కెట్‌లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో నక్సలైట్లు దాడి చేయడంతో శనివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఉదయం 9:30 గంటలకు ఈ దాడి జరిగింది. ఘటన తర్వాత సీఏఎఫ్ బృందం భద్రత కోసం గ్రామ మార్కెట్‌లో మోహరించి గస్తీ నిర్వహిస్తోంది. ఘటన అనంతరం అధికారులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. గత నెల, రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో నక్సలైట్లు జరిపిన దాడిలో ముగ్గురు CRPF జవాన్లు మరణించారు మరియు 14 మంది గాయపడ్డారు. టేకుల గూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది.